కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్లతో ఈ మిషన్ ను అమలు చేయనుంది. భారత్ లో ఆఫ్ షోర్ ప్రాంతాల్లో కీలకమైన మినరల్స్ అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేయనుంది. అరుదుగా లభించే మినరల్స్ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడంతో పాటు ఈ రంగంలో స్వావలంబన దిశగా అడుగులు వేయడమే ఈ మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక సి.హెచ్.వి మొలాసిస్ నుండి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరను రూ.56.28 నుండి రూ.57.97కు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. బి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరకు రసం/చక్కెర/చక్కెర సిరప్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు ఆమోదం: కేంద్ర కేబినెట్ నిర్ణయం
By admin1 Min Read
Previous Articleజపాన్‌కు రండి: ట్రంప్‌నకు ఆహ్వానం
Next Article పాకిస్థానీని మూడో పెళ్లి చేసుకోబోతున్న రాఖీ సావంత్