దేశ వ్యాప్తంగా ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై చర్చ కొనసాగుతున్న మేరా ఆర్థిక సర్వే కీలకమైన వివరాలను వెల్లడించింది.అయితే వారానికి 60 గంటలకు పైగా పని చేయడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఈ సర్వే సూచిస్తోంది.రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆఫీసులో గడిపే ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.సాధారణంగా, ఉత్పాదకతను పని గంటల ఆధారంగా కొలుస్తారు. అంటే,ఎక్కువ సమయం పని చేస్తే,ఎక్కువ ఫలితాలు లభిస్తాయని భావిస్తారు.
అదే విధంగా కార్యాలయల్లో వాతావరణం, సహోద్యోగులతో సంబంధాలు కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయని ఆర్థిక సర్వే తెలియజేసింది.నెలకు కనీసం రెండు నుంచి మూడు రోజులు కుటుంబ సభ్యులు,బంధువులతో గడపడం ద్వారా ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా,మెరుగైన జీవనశైలి సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది.డబ్ల్యూహెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం,ఉద్యోగస్తులపై ఒత్తిడి,ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టానికి దారితీయగలవని ఆర్థిక సర్వే హెచ్చరించింది.