కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2025-26కు సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తి ని ప్రస్తావించారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ …‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అంటూ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి పేర్కొన్నారు.పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని వెల్లడించారు. దేశంలో వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల రైతులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
గురజాడ అప్పారావు సూక్తితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
By admin1 Min Read
Previous Article‘గౌరవంగా చనిపోయే హక్కు’ను అమల్లోకి తెచ్చిన కర్ణాటక సర్కారు
Next Article ఖాతాదారులకు జియో షాక్ …!