ప్రముఖ వ్యోమగామి భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా సరికొత్త చరిత్ర లిఖించారు. ఇప్పటివరకు ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. సునీత మరియు బుచ్ విల్ మోర్ అనే మరో వ్యోమగామి గతేడాది జూన్ లో 8 రోజుల అంతరిక్ష యానం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) కు వెళ్లారు. అయితే స్పేస్ షిప్ లో సాంకేతిక సమస్య కారణంగా వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. జనవరి30న ఐఎస్ఎస్ బయటకు వచ్చిన వీరిద్దరూ 5 గంటల 26 నిమిషాల పాటు కొన్ని మరమ్మతులు నిర్వహించారు. సునీతకు ఇది 9వ స్పేస్ వాక్ కాగా బుచ్ విల్ మోర్ కు ద5వ స్పేస్ వాక్. మొత్తంమీద 62 గంటల 6 నిమిషాల పాటు సునీత స్పేస్ వాక్‌లో పాల్గొన్నారు. దీంతో నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న రికార్డును సునీతా విలియమ్స్ అధిగమించారు. పెగ్గీ మొత్తం 60 గంటల 21 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు.
స్పేస్ వాక్ తో సరికొత్త చరిత్ర సృష్టించిన వ్యోమగామి సునీతా విలియమ్స్
By admin1 Min Read
Previous Articleదేశ చరిత్రలోనే మొదటి సారి రూ.50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్
Next Article ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..!

