ఇటీవల కాలంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగుల పని గంటల పెంపుకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈమేరకు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వారి అధికార పరిధిలో నిర్వహిస్తాయని పేర్కొన్నారు. చట్టాల అమలును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ (సీఐఆర్ఎం) తనిఖీ అధికారులు చూడగా, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయని మంత్రి వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు