యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూ.జీ.సీ) కొత్త ముసాయిదా (డ్రాఫ్ట్) నిబంధనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డీఎంకే స్టూడెంట్స్ విభాగం నిరసన చేపట్టింది. ఈ నిరసనలు లో డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదు. ఇది మన సంప్రదాయం, చరిత్ర, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న ప్రయత్నం అని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల విద్యా వ్యవస్థ పై వారు చేస్తున్న ఈ ప్రయత్నం తమ ఎజెండా కోసమేనని రాహుల్ ఆరోపణలు చేశారు. ఈ ముసాయిదా తాము కూడా వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ కూడా తెలిపారు.
వర్శిటీలు, కాలేజీలో లెక్చరర్లు, టీచింగ్ స్టాఫ్ నియామకం, పదోన్నతి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు మార్గదర్శకాలు-2025 పేరిట యూజీసీ ఇటీవల ఒక ముసాయిదా విడుదల చేసింది. దీనిని బీజేపీ యేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో ఉన్నా పలు అంశాలు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు వైస్ ఛాన్సలర్ లో నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా… కొత్త ముసాయిదా ప్రకారం ఆ అధికారం గవర్నర్ల చేతిలోకి వెళ్తుంది. దీనిపై బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు నిరసిస్తున్నాయి.
యూ.జీ.సీ కొత్త ముసాయిదా నిబంధనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ధ్వజం
By admin1 Min Read