వాహనదారులందరికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన టోల్ విధానం అమలు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ మేరకు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులు టోల్ ఛార్జీల అంశంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.దేశంలోని ప్రధాన జాతీయ రహదారులపై అధిక టోల్ ఛార్జీలు వసూలు చేయడం, రహదారి సేవలు తగినంతగా అందకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వాహనదారులు అసంతృప్తి వ్యాక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా స్పందించారు.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ప్రయాణికులకు ‘త్వరలో’ ఉపశమనం లభిస్తుందని అన్నారు.కొత్త టోల్ పథకానికి సంబంధించిన తమ పరిశోధన పూర్తైందని.. .పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.అయితే టోల్ వసూళ్లపై సోషల్ మీడియాలో అనేక మిమ్స్ వస్తున్నాయని నాకు తెలుసు అన్నారు.చాలా మంది నన్ను ట్రోల్స్ చేస్తున్నారు.టోల్ విషయంలో ప్రజలు కొంచెం కోపంగా ఉన్నారు.ఈ కోపం కొద్ది రోజుల్లో తొలిగిపోతుందని నేను చెప్పగలనుని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.