అప్పుడు ఎప్పుడో ఏఎన్ఆర్ మనం చిత్రంలో కొన్ని సెకన్లు పాటు కనిపించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత సైరాలో మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసై వెంకన్నగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.కాగా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కిలో అశ్వద్ధామగా అద్భుతంగా నటించాడు.ఇందులో అమితాబ్ బచ్చన్ నటనకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.అశ్వద్ధామ అంటే ఆయనే గుర్తువచ్చేలా చేసారు.
గత ఏడాది జరిగిన అక్కినేని నాగేశ్వరరావు జాతీ అవార్డుల వేడుకలో నేనూ తెలుగు నటుడినే…నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.అయితే అమితాబ్ బచ్చన్ చెప్పినట్లుగా ఆయనలోని నటుడిని మన దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నారు..గౌరవిస్తున్నారు.అయితే తాకగా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తుంది.అయితే ఈ చిత్రం 1850ల నాటి కథాంశంతో రూపొందనుంది. ఇందులో బిగ్ బి కోసం డిఫరెంట్ క్యారెక్టర్ రాహుల్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.