భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణా రంగంలో దూసుకెళ్తోందని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ఏరో ఇండియా వాణిజ్య కార్యకలాపాల ముగింపు సమావేశంలో మాట్లాడారు. భారత డిఫెన్స్ సెక్టార్ లో సాధిస్తున్న అభివృద్ధిని ప్రదర్శించే వేదికగా ఏరో ఇండియా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన పట్ల ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. పది సంవత్సరాల క్రితం వరకు కూడా భారత రక్షణ రంగ అవసరాల కోసం 70 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుండగా నేడు ఆ స్థాయిలో దేశంలోనే తయారవుతున్నాయి అన్నారు. చిన్న తరహా వెపన్స్ నుండి అడ్వాన్స్డ్ మిస్సైల్స్ వరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి విదేశాలకు కూడా పంపుతున్నట్లు వివరించారు. ఇక షో చివరి రోజున ఇథియోపియా, శ్రీలంక, జింబాబ్వే, యెమెన్ తదితర దేశాల రక్షణ మంత్రులు, సైనిక అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Previous Articleజీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం
Next Article చెక్కు చెదరని మోడీ వేవ్:మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడి