సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈనెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత సీఈసీ ఎంపికకు సంబంధించి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈనెల 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై ఒకరి పేరును సిఫార్సు చేయనుంది. దాని ఆధారంగా రాష్ట్రపతి తదుపరి సీఈసీని నియమిస్తారు. సీఈసీ పదవీ విరమణ సమయంలో సంప్రదాయం ప్రకారం ఎలక్షన్ కమీషన్ లో అత్యంత సీనియర్ కమీషనర్ కు సీఈసీగా పదోన్నతి కల్పిస్తారు.
తర్వాతి సీఈసీ ఎన్నిక కోసం ఈనెల 17న భేటీ కానున్న పీఎం మోడీ నేతృత్వంలోని కమిటీ
By admin1 Min Read