ఉక్రెయిన్ లో శాంతి చర్చల ప్రక్రియ శరవేగంగా ముందుకు కదులుతోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పశ్చిమాసియా అధికారిక పర్యటన కోసం యూఏఈ చేరుకున్నారు. అమెరికా నుండి కీలక అధికారులు కూడా సౌదీకి బయలుదేరారు. మరోవైపు కొద్ది రోజులలో అమెరికా-రష్యాల మధ్య యూఏఈలో ఉక్రెయిన్ గురించి శాంతి చర్చలు జరుగనున్నాయి. ఉక్రెయిన్ రష్యా లో మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. ఇక ఈ శాంతి చర్చల కోసం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్ కోఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్జ్ కూడా సౌదీకి బయలుదేరారు. యుద్దాన్ని ముగించే ఏ చర్చలలో అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా భాగమవుతారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు