దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈరోజు రామ్ లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీకి ఆమె నాలుగో మహిళా ముఖ్యమంత్రి. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు.ఆమెతో పాటు డిప్యూటీ సీఎం పర్వేష్, ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
ఢిల్లీలో కొలువు తీరిన కొత్త సర్కారు:సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
By admin1 Min Read
Previous Articleకేంద్ర జల శక్తి మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
Next Article ఏపీ ఫైబర్ నెట్ లో ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు..!