ఢిల్లీలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ మాజీ సీఎం ఆతిశీ విమర్శించారు.అయితే ఢిల్లీ మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.తోలి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ విమర్శలు చేశారు.ఈ విమర్శలపై ప్రస్తుత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ…తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు…అప్పుడే విమర్శలు చేస్తున్నారా..? అంటూ ఆమె మండిపడ్డారు.ఈ మేరకు ఆమెకు సీఎం గట్టి బదులిచ్చారు.కొత్త ప్రభుత్వానికి లెక్చర్ ఇవ్వొద్దని..బదులుగా తన సొంత పని చూసుకుంటే మంచిదని’ వ్యాఖ్యానించారు.తాము మొదటి రోజే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించినట్లు తెలిపారు.
అయితే దీని ద్వారా ప్రజలకు రూ.10 లక్షల ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.కాగా ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు పాలించింది.ఆప్ 13 సంవత్సరాలు అధికారంలో ఉంది.ఆ సమయంలో మీరు ఏం చేశారు…అంటూ రేఖ గుప్త నిలదీశారు.ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో అనేక అవినీతి ఘటనలు వెలుగులోకి వచ్చాయంటూ ఆతిశీపై విరుచుకుపడ్డారు.అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఢిల్లీ పరిపాలనకు సంబంధించి కాగ్ రూపొందించిన నివేదిక ప్రవేశపెట్టినప్పుడు…అనేక మంది రహస్యాలు బయటపడతాయని…వారు భయపడుతున్నారు’ అంటూ సీఎం రేఖా గుప్తా విలేకరులతో అన్నారు.