ఈశాన్య భారత్ లో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతం దేశ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేస్తోందన్నారు. ఆయన తాజాగా గువాహటిలో ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు.2014 నుండి అస్సాం రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని చెబుతూ తమ ప్రభుత్వం అమలు చేసిన వివిధ కార్యక్రమాలను ప్రధాని మోడీ వివరించారు. అస్సాం వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా భారత్ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని నిపుణులు కూడా ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారని తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, స్కిల్ సెక్టార్లలో అగ్రభాగాన నిలుస్తోన్న మనదేశ యువతపై విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
ప్రధాని మోడీకి అరుదైన బహుమతులు:
అస్సాం సీఎం హిమంత్ అరుదైన బహుమతులను ప్రధాని మోడీకి అందించారు. సెమీకండక్టర్ చిప్ లతో తయారుచేసిన ఖడ్గమృగం బొమ్మను, కామాఖ్య ఆలయ ప్రతిమను బహూకరించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ సెంటర్ నిర్మించేందుకు టాటా గ్రూప్తో అస్సాం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈశాన్య భారత్ లో నవ శకం… ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
By admin1 Min Read