సమాచారాన్ని లీక్ చేసిన 20 మంది ఉద్యోగుల్ని మెటా సంస్థ తొలగించింది.అయితే ఆ 20మంది ఉద్యోగులు రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.వాళ్లు ఏ ఉద్దేశంతో సమాచారం లీక్ చేసినా…తమ విధానాలకు విరుద్ధమని మెటా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.ఇటీవల కంపెనీలో ఓ దర్యాప్తు చేపట్టామని,దీనితో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలింది.వాళ్లు కంపెనీ రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తెలిసిందని మెటా ప్రతినిధి వెల్లడించారు.త్వరలో మరికొంత మంది కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.సంస్థ సమాచారాన్ని లీక్ చేసే అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామని,లీక్‌లు జరుగుతున్నట్లు గుర్తించినప్పుడల్లా ఇలాంటి చర్యలు ఉంటాయని అన్నారు.
సమాచారాన్ని లీక్ చేసిన 20 మంది ఉద్యోగుల్ని తొలగించిన మెటా సంస్థ
By admin1 Min Read