పొరుగు దేశం నేపాల్‌లో భూకంపం వచ్చింది.కాగా ఈరోజు తెల్లవారుజామున సింధుపల్‌చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది.అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది.ఈ మేరకు భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. దుగుంగడి భీర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని,అయితే ఆ ప్రదేశంలో ఇండ్లు లేవని వెల్లడించారు.ఈ క్రమంలోనే భారత్ తో పాటుగా చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా భూమి స్వల్పంగా కంపించదని తెలుస్తుంది.
An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today.
(Source – National Center for Seismology) pic.twitter.com/OtockGLncO
— ANI (@ANI) February 27, 2025