తమిళ సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌స్టన్’.ఇందులో దివ్య భారతికథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నాడు.మార్చి 07న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ చిత్రాన్ని సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే కథతో రూపొందించినట్లు తెలుస్తుంది.ఇందులో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్,సాబుమోన్ అబ్దుసమద్,ఆంటోని,అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ & ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి అందిస్తున్నాడు.
Previous Articleఏపీ బడ్జెట్ 2025-26… వివిధ కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు
Next Article సల్మాన్ ఖాన్ “సికిందర్” టీజర్ విడుదల ….!