తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్‌సైట్ ను.. కేంద్రం బ్లాక్ చేసింది.దీనితో వికటన్ సంస్థ న్యాయ పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతుందని తెలుస్తుంది.ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే.అయితే ట్రంప్ వద్ద మోదీ సంకెళ్లతో కూర్చుకున్నట్లు వికటన్ వెబ్‌సైట్ ఓ కార్టూన్ వేసింది.కాగా ఈనెల 10వ తేదీన ఈ కార్టూన్‌ను పబ్లిష్ చేశారు.15వ తేదీ నుండి ఆ వెబ్‌సైట్ అందుబాటులో లేదని వికటన్ సంస్థ తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించింది.
కేంద్ర సమాచార & ప్రసారశాఖ తీసుకున్న నిర్ణయం వలన తమ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యిందని వికటన్ పేర్కొంది.ముందుస్తు సమాచారం ఇవ్వకుండానే సైట్‌ను బ్లాక్ చేశారని తెలిపింది.వెబ్‌సైట్ బ్లాక్ చేసిన అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన విచారణ చేపట్టారు.కాగా భావ స్వేచ్చతో ఆ కార్టూన్ వేసినట్లు విచారణ సమయంలో వికటన్ తన వాదనను సమర్థించుకుంది.ఈ మేరకు ఫిబ్రవరి 25వ తేదీన మాత్రమే తమకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ నుండి అధికారిక ఆదేశాలు అందినట్లు వికటన్ వెల్లడించింది.
Vikatan is now consulting legal experts to determine appropriate next steps. The publication is pursuing all legal avenues to both defend freedom of expression and restore access to the website.#VikatanForFreedomOfExpression | #VikatanCartoonRow | #AnandaVikatan pic.twitter.com/jV1IK0EvOG
— விகடன் (@vikatan) February 27, 2025