ఈరోజు ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేతం బద్రీనాథ్ వద్ద భారీ స్థాయిలో మంచు చరియలు విరిగిపడ్డాయి.ఈ మేరకు మంచు కింద 55 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారని సమాచారం.ఈ కార్మికులు రహదారి పనులు చేస్తుండగా, ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయని తెలుస్తోంది.దీనితో కార్మికులు ఎటు తప్పించుకో లేకపోయారని చెబుతున్నారు.ఉత్తరాఖండ్ లో గత 2 రోజులుగా హిమపాతం నమోదు అవుతుంది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకున్నారు.ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సమాచారం.
ఆ రాష్ట్రాల్లో భారీ హిమపాతం…!
దేశంలోని జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తుంది.దీనితో అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకుంది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోవడంతో అధికారులు పలు రహదారుల్ని మూసివేశారు (Blocks Key Highways).