మార్చి 15 నుండి ‘స్పేడెక్స్’ ప్రయోగాలను చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వీ.నారాయణన్ తెలిపారు. స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా గతేడాది డిసెంబర్ లో రెండు శాటిలైట్ లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సంగతి తెలిసిందే. విజయవంతంగా స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇక తాజాగా ఈ ప్రయోగాలను పునః ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మార్చి 15 నుండి స్పేడెక్స్ ప్రయోగాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఇస్రో దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
మార్చి 15 నుండి ‘స్పేడెక్స్’ ప్రయోగాలు: ఇస్రో ఛైర్మన్ వీ.నారాయణన్
By admin1 Min Read
Previous Article‘సెబీ’ కొత్త సారథిగా తుహిన్ కాంత పాండే…!
Next Article వారాంతంలో భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు..!