భారత్- యూరప్ యూనియన్ లు కీలక ప్రకటన చేశాయి. తమ మధ్య ఎప్పటినుండో చర్చల్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ను ఈ సంవత్సరం చివరి నాటికి ట్రాక్ లోకి తీసుకుని రానున్నట్లు తెలిపాయి. ఈమేరకు సంప్రదింపులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నాయి. డిఫెన్స్, సెక్యూరిటీ, టెక్నాలజీ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ విచ్చేసిన ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. తమ సన్నిహిత మిత్ర దేశాలొన జపాన్, సౌత్ కొరియాలతో కుదుర్చుకున్న ఒప్పందం తరహాలో భారత్ తో కూడా డిఫెన్స్, సెక్యూరిటీ రంగాల్లో పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్లు లెయన్ తెలిపారు. 2025 తర్వాత ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గం చూపే విధంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్-ఈయూ మధ్య శిఖరాగ్ర సదస్సులో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడులు పెంచుకునేందుకు భారత్-ఈయూ కృషి చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.
ఎఫ్.టి.ఏపై భారత్- యూరప్ యూనియన్ కీలక ప్రకటన… ప్రధాని మోడీతో ఈయూ అధ్యక్షురాలు భేటీ
By admin1 Min Read