తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు తమిళనాడు ప్రజలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు.తమిళనాడు విజయవంతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ చర్యలు ఇప్పుడు ప్రతికూల స్థితిలో ఉంచాయని వ్యాఖ్యానించారు.కాగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 ఎంపీ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.ప్రజలు ఆలస్యం చేయకుండా తన విజ్ఞప్తి మేరకు వెంటనే పిల్లల్నికనాలని పిలుపునిచ్చారు.
ఎక్కువమంది పిల్లల్ని కనండి:-ఏపీ సీఎం చంద్రబాబు
ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కువమంది పిల్లల్ని కనాలని వ్యాఖ్యలు చేశారు. జనాభా సమతుల్యతపై వృద్ధాప్య జనాభా ప్రభావంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు కోరారు. ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతించే చట్టాన్ని తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అయన తెలిపాడు.

