రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించనున్నారని తెలుస్తుంది.ప్రధాని పాల్గొనే ఈ ఈవెంట్‌లో కేవలం మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.కాగా హెలిప్యాడ్ నుండి వేదిక వరకూ ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని పేర్కొనారు.అయితే ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే కాపలా కాయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
Previous Articleభారత్ పై అమెరికా సుంకాల పెంపుతో నష్టం లేకుండా చూస్తాం..!
Next Article ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం