దక్షిణాది పార్టీలను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ , పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్, కేరళ వంటి 7 రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలు రాశారు. డీలిమిటేషన్ పై సమిష్టి కార్యాచరణ కోసం కలసిరావాలని కోరారు. ఈనెల 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేశారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అఖిలపక్షం తీర్మానం చేసింది.జేఏసీ ఏర్పాటు చేశారు. మార్చి 22న చెన్నైలో జేఏసీ మొదటి సమావేశం జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు తగ్గుతాయనే దానిపై డీఎంకే బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో డీఎంకే పోరాటానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తోంది.
డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది పార్టీలు సహా 7 రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం ఆహ్వానం
By admin1 Min Read