కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ప్రధాని పదవి నుండి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో లిబరల్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తాజాగా జరిపారు. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ సమీప అభ్యర్థి క్రిస్టియా ఫ్రీలాండ్ పై గెలిచి పార్టీ కొత్త అధినేతగా ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసినట్లే. మొత్తం 150,000 పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు అంటే 85.9 శాతం వచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టి ఏవిధమైన చర్యలు తీసుకుంటిరోనని కెనడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కెనడాలో అధికార లిబరల్ పార్టీ కొత్త నేతగా మార్క్ కార్నీ ఎన్నిక…త్వరలో ప్రధాని బాధ్యతలు
By admin1 Min Read

