ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఒ.పి. చౌధరి చేసిన పని పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. స్వయంగా ఆయన చేతిరాతతోనే పూర్తి బడ్జెట్‌ను రూపొందించడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సుమారు రూ.1.65 లక్షల కోట్లతో ఆయన శాసనసభకు సమర్పించారు. మాములుగా బడ్జెట్ ప్రతులను అధికారులు కంప్యూటర్లతో రూపొందిస్తుంటారు. అయితే ఒ.పి. చౌధరి మాత్రం ఆయనే స్వయంగా బడ్జెట్‌ను స్వయంగా హిందీలో రాశారు. దీని కోసం దాదాపు నాలుగు రోజులపాటు రోజుకు గంట లేదా గంటన్నర మాత్రమే నిద్రపోయారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తాను ఐఏఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చౌధరి తెలిపారు. చేతితో రాసిన బడ్జెట్ పత్రం పారదర్శకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన చౌధరి 2018లో బీజేపీలో చేరారు. 2023లో రాయ్ పూర్ నుండి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు.
చేతిరాతతోనే పూర్తి బడ్జెట్…ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఒ.పి. చౌధరి చొరవ
By admin1 Min Read
Previous Articleటీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత… సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Next Article నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు