అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి పలు దేశాలపై సుంకాలు విధిస్తూ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. కాగా కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తామని మొదట చెప్పిన ట్రంప్ ఆ విషయంలో ప్రస్తుతం వెనక్కితగ్గారు. అమెరికాలోని పలు రాష్ట్రాలపై విద్యుత్ ధరల పెంపును కెనడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో ట్రంప్ కూడా పట్టువీడినట్లు తెలుస్తోంది. అమెరికాకి సరఫరా చేసే విద్యుత్ పై 25% అదనపు రుసుము వసూలు చేస్తామని ఆంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ పేర్కొనడంతో కెనడా స్టీల్, అల్యూమినియంపై 50% సుంకాలు విధిస్తామని ట్రంప్ మొదట ప్రకటించారు. అయితే తాజాగా ఆ పెంపును తాత్కాలికంగా నిలిపివేశారు.
కాగా, యూఎస్ వాణిజ్య సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ తో చర్చల తర్వాత విద్యుత్ పై 25% అదనపు రుసుము వసూలు చేయాలనేది ప్రణాళికలను పక్కకు పెట్టినట్లు ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు