‘ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) సవరణ బిల్లు-2024’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
దేశీయంగా ఆయిల్ ఫీల్డ్స్ అన్వేషణను ప్రోత్సహించడం దేశంలో ఆయిల్ ఉత్పత్తిని అధికం చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన ‘ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) సవరణ బిల్లు-2024’ తీసుకొచ్చింది . తాజాగా ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదించింది . రాజ్యసభ గతేడాది డిసెంబరు 3న ఆమోదం తెలిపింది. 1948నాటి ఆయిల్ ఫీల్డ్స్ చట్టానికి స్వల్ప మార్పులు చేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్లలో ఏ దేశంలోనూ లేని విధంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. రెండు సందర్భాల్లో కేంద్రం సుంకాలను తగ్గించడం ద్వారా ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది.
‘ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) సవరణ బిల్లు-2024’కు పార్లమెంటు ఆమోదం
By admin1 Min Read