జమ్మూకశ్మీర్ మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంచి వార్తను అందించారు. ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వ రంగ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంతో మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా వారి దైనందిన జీవితానికి మరింత సౌలభ్యం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. మహిళలకు మరింత స్వేచ్ఛ, అవకాశాలను అందించనుందని తెలిపారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటన పట్ల జమ్మూకశ్మీర్ మహిళలు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం ఒమర్ అబ్దుల్లా
By admin1 Min Read