హాలీవుడ్ ప్రముఖులు, రచయితలు, సంగీతకారులు, దర్శకులు సహా 400 మందికి పైగా కళాకారులు ట్రంప్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.ఏఐ శిక్షణ కోసం సినిమాలు, పాటలు, టీవీ షోలు, కళా రూపాలకు సంబంధించిన కాపీరైట్ చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ లేఖపై బెన్ స్టిల్లర్, మార్క్ రఫాలో, పాల్ మెక్ కార్ట్ నీ తదితరులు సంతకం చేశారు.గూగుల్, ఓపెన్ ఏఐ వంటి టెక్ దిగ్గజాలు కాపీరైట్ చట్టాలను సడలించాలని చూస్తుండటం సరైంది కాదని వారు విమర్శించారు.కాపీరైట్ హక్కులను బలహీనపరిస్తే,అమెరికా సాంస్కృతిక, ఆర్థిక రంగాలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. వినోద పరిశ్రమ 2.3 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోందని, 229 బిలియన్ డాలర్ల వేతనాలను అందిస్తోందని గుర్తుచేశారు.టెక్ కంపెనీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, సృజనాత్మక రంగాన్ని ఉచితంగా ఉపయోగించుకోవడం అన్యాయమని ఆక్షేపించారు.
గూగుల్, ఓపెన్ ఏఐ ప్రతిపాదనపై మండిపడుతున్న హాలీవుడ్ సెలెబ్రిటీలు
By admin1 Min Read

