బట్టతలతో బాధపడేవారికి శాస్త్రవేత్తలు కొత్త ఆశాజ్యోతి చూపించారు. ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీ, పాకిస్థాన్‌లోని కాస్మట్స్ యూనివర్సిటీ పరిశోధకులు డియోక్సీరైబోస్ షుగర్ జెల్ సాయంతో వెంట్రుకల పెరుగుదల సాధ్యమని నిర్ధారించారు. గాయాలను నయం చేసే ప్రయోగాల్లో ఈ జెల్ వాడినప్పుడు వెంట్రుకలు ఊహించని స్థాయిలో పెరిగినట్లు గుర్తించారు. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ షుగర్ జెల్ కారణంగా మందపాటి, పొడవైన జుట్టు పెరిగినట్టు వెల్లడైంది. ఈ జెల్ కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు పెరిగేందుకు సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల సమస్యకు ఇది సమర్థమైన చికిత్సగా మారొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లభ్యమయ్యే చికిత్సల్లో పలు దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, ఈ కొత్త విధానం సురక్షితమైనదిగా కనిపిస్తోంది. అయితే, మానవులపై పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ ఫార్మాకాలజీ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

