టెక్ దిగ్గజం ‘ఐబీఎం’ ఈ ఏడాది అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 9 వేల మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల్లోని ఉద్యోగాలను ఆఫ్షోర్ మార్గంలో నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ తరలింపులో ఎక్కువగా భారత్ వంటి దేశాలకు ఉద్యోగ అవకాశాలు వెళ్లే అవకాశం ఉందని బ్రిటిష్ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ ‘ద రిజిస్టర్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఖాళీ అవుతున్న ఉద్యోగ స్థానాలను భారతదేశానికి తరలించడం గత కొన్నేండ్లుగా జరుగుతున్న ప్రక్రియేనని ఐబీఎం ఇన్సైడర్స్ పేర్కొన్నారు. ఈ చర్యలతో అమెరికాలో ఐటీ రంగ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

