సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూపర్ స్టార్ రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు.సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలో చొరబడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ,అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.26/11 ముంబై ఉగ్రదాడిని ఉదహరిస్తూ, సముద్ర మార్గం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు 175 మందిని హతమర్చారని గుర్తుచేశారు.ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు 7,000 కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు.వారు మీ ప్రాంతానికి వచ్చేటప్పుడు స్వాగతించాలని, సాధ్యమైనంతవరకు వారికి సహకరించాలని రజనీకాంత్ కోరారు.
సముద్రతీర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సూపర్ స్టార్ రజనీకాంత్
By admin1 Min Read
Previous Articleకునాల్ కమ్రా స్కిట్ వివాదం: మహారాష్ట్రలో రాజకీయ కలకలం
Next Article భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు..!