పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శుభవార్త చెప్పింది. వారి జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుండి రూ.1.24లక్షలకు పెంచింది. వారి జీతభత్యాలతో పాటు పెన్షన్, అదనపు పెన్షన్ ను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును 2023, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు నెల జీతం రూ. లక్ష నుంచి లక్షా 24 వేలకు, అలాగే వారికిచ్చే దినసరి భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 2, 500కు పెంచింది. మాజీ ఎంపీలకు పెన్షన్‌ను నెలకు రూ. 25 వేల నుంచి రూ.31 వేలకు సవరించింది. ఐదేళ్లకుపైగా ప్రతి అదనపు సంవత్సరానికి అదనపు పెన్షన్‌ను రూ.2 వేల నుండి రూ.2,500కు పెంచింది. చివరిగా 2018లో ఎంపీల జీతభత్యాలు పెంచింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో లోక్ సభకు 543, రాజ్యసభకు 245 మంది ఎంపీలు ఉన్నారు. వీరందరికీ ఈ తాజా పెంపు వర్తించనుంది.
ఎంపీల జీతాలు.. మాజీ ఎంపీల పెన్షన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
By admin1 Min Read
Previous Articleభారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు..!
Next Article ప్రారంభమైన వరుణ్ తేజ్ కొత్త చిత్రం