ఇటీవల మయన్మార్ లో సంభవించిన భూకంపంలో 1000 మందికి పైగా మృతి చెందారు. కాగా, వీరిలో భారతీయులు ఎవరూ లేరని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ మయన్మార్ కు ఆపన్నహాస్తం అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అత్యవసర సామాగ్రి, సహాయక సిబ్బందిని పంపించింది. మయన్మార్ లో భూకంపం సంభవించిన వెంటనే మన ప్రధాని మోడీ స్పందించారు. ఆపదలో ఉన్న మయన్మార్ ప్రజలకు, ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయక చర్యలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈరోజు కూడా సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హిలాయింగ్ తో ప్రధాని మోడీ మాట్లాడారు. బాధిత కుటుంబాలకు భారత్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఉదయం ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించినట్లు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా భారత వాయుసేన విమానాల్లో పంపిస్తున్నట్లు సహాయక సామగ్రి చేరవేతకు ఇండియన్ నేవీని రంగంలోకి దించినట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

