కేరళ,గుజరాత్,అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షోర్ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు.సముద్ర తీర ప్రాంతాల్లో మైనింగ్ ప్రాజెక్ట్‌లు పర్యావరణానికి మరియు కోస్టల్ ప్రజల జీవనోపాధికి హానికరంగా మారతాయని ఆయన హెచ్చరించారు.రాహుల్ గాంధీ తన లేఖలో “ప్రైవేట్ కంపెనీలకు మైనింగ్ అనుమతులు ఇవ్వడం ఆందోళనకరం” అని పేర్కొన్నారు.స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా టెండర్లు మంజూరు చేయడాన్ని ఖండించారు.మైనింగ్ వల్ల సముద్ర జీవాల మనుగడ ప్రమాదంలో పడుతుందని,మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుందని రాహుల్ గాంధీ అన్నారు.
13 ప్రదేశాల్లో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు కేంద్రం టెండర్లు నిర్వహించగా,స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేరళలో 11 లక్షల మంది చేపల వేటపై ఆధారపడుతున్నారని, మైనింగ్ ప్రభావం వారికి తీవ్రంగా ఉంటుందని రాహుల్ తెలిపారు.ప్రభుత్వం తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని,ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ సవరణ చట్టాన్ని పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.కొల్లాంలో మెరైన్ మానిటరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం కూడా ఫిష్ బ్రీడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.