బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఇటీవల చైనా పర్యటనలో భారత్‌కు చెందిన ఈశాన్య రాష్ట్రాల భూభాగం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు.యూనుస్ చేసిన మాటలు దురుద్దేశపూర్వకమైనవి అని, వాటిని తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు.యూనుస్ ప్రకారం, ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్‌లాక్ అయ్యాయి కాబట్టి ఆర్థిక అవసరాల నిమిత్తం చైనా సహాయం అవసరం అని అన్నారు. అంతేకాక,ఆ ప్రాంతంలో సముద్ర సంరక్షణ బాధ్యత బంగ్లాదేశ్ చూసుకుంటుందంటూ వ్యాఖ్యానించారుదీనిపై అస్సాం సీఎం బిశ్వ శర్మ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా స్పందిస్తూ,యూనుస్ వ్యాఖ్యలు భారత భూభాగ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయంటూ ఖండించారు.ఈ వివాదాస్పద ప్రకటన భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇటువంటి వ్యాఖ్యల వెనుక సుదీర్ఘ వ్యూహాత్మక ప్రణాళిక ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.యూనుస్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో,దీనిపై చర్చలు పెరిగాయి.
బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం తీవ్ర విమర్శలు
By admin1 Min Read