నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియను చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో,తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఇటీవల దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు సమావేశమై తీర్మానం చేశారు.ఈ తీర్మానం ప్రతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పించేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మార్చి 27వ తేదీన తాను రాసిన లేఖను స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.గత నెల 22న చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశంలో,ఈ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కేటీఆర్,ఎంపీలు,ఇతర ప్రముఖ నేతలు హాజరయ్యారు.ఈ సమావేశంలో, కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన విధానాన్ని అంగీకరించబోమని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కట్టడి చేయాలని తీర్మానించారు.ఈ డీలిమిటేషన్ అంశంపై రెండో సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
By admin1 Min Read