దేశ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు ఉభయ సభలు తుది ఆమోదం తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ,ఇది చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందన్నారు.వక్ఫ్ పరిపాలనలో జవాబుదారీతనం,పారదర్శకతను తీసుకొచ్చేలా ఈ చట్టం రూపొందిందని తెలిపారు. ముఖ్యంగా ముస్లిం మహిళలకు, వంచిత వర్గాలకు న్యాయం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ముస్లింల అభివృద్ధికి ఇది ఓ నూతన దిశ చూపుతుందని పేర్కొన్నారు.బిల్లుకు మద్దతిచ్చిన సభ్యులకూ,సూచనలు చేసిన ప్రజలకూ కృతజ్ఞతలు తెలిపారు.ఇది సమానత, న్యాయం, సంపూర్ణ వృద్ధి దిశగా ముందడుగని పేర్కొన్నారు.ప్రభుత్వ భావితరాల ఉద్దేశాన్ని ప్రతిబింబించేలా యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ బిల్లును (UMMEED) అభివర్ణించారు.ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపించనున్నారు.ఆమోదం లభించిన అనంతరం చట్టంగా మారనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు