కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్‌పై ఆర్థిక నేరాల కేసు నమోదు కావడంతో ఆమె సంక్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నారు.కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ కేసుపై విచారణకు అనుమతి మంజూరు చేసింది.వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు,ప్రభుత్వరంగ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ నుంచి రూ.1.72 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఎస్‌ఎఫ్ఐఓ (SFIO) సమగ్ర దర్యాప్తు నిర్వహించింది.దర్యాప్తు ఫలితంగా 160 పేజీల ఛార్జ్‌షీట్‌ను కేంద్రం పరిశీలించి కోర్టులో దాఖలు చేసింది.2017–2020 మధ్య జరిగిన ఈ లావాదేవీలపై కోచ్చిలోని ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో కేసు నమోదైంది.ఛార్జ్‌షీట్‌లో టీ వీణాతో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా సహా 25 మంది నిందితులుగా ఉన్నారు. కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 447 కింద ఆరోపణలు మోపబడ్డాయి.దోషిగా తేలితే కనీసం ఆరు నెలల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.అక్రమంగా పొందిన మొత్తం మీద మూడు రెట్లు జరిమానా విధించే అవకాశమూ ఉందని అధికారులు తెలిపారు.
ఆర్థిక నేరాల కేసులో కేరళ సీఎం కుమార్తె టీ వీణా విజయన్‌పై విచారణకు కేంద్రం అనుమతి…!
By admin1 Min Read