సౌదీ అరేబియా ప్రభుత్వం ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించింది. సరైన ధ్రువీకరణ లేకుండా హజ్ యాత్రకు ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని దేశాలవారు ఇతర వీసాలపై వచ్చి గడువు ముగిసినా సౌదీలో ఉండుతూ, అనధికారంగా హజ్‌లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ నిషేధం భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా మొత్తం 14 దేశాలకు వర్తించనుంది. హజ్ యాత్రను సజావుగా, భద్రంగా నిర్వహించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సరైన రిజిస్ట్రేషన్, అనుమతులు లేని వారిని పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. వీసాల జారీ ప్రక్రియను గట్టిగా పర్యవేక్షించనుంది. ఈ చర్యల ద్వారా హజ్ వ్యవస్థలో పారదర్శకత, క్రమబద్ధత పెరుగుతుందని భావిస్తున్నారు. అధికారిక ఛానళ్ల ద్వారానే వీసా పొందాలని అధికారులు పిలుపునిచ్చారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భారత్ తో పాటుగా 14 దేశాలకు వీసాల జారీపై తాత్కాలిక నిషేధంవిధించిన సౌదీ…!
By admin1 Min Read