అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత నేపథ్యంలో కేంద్రం వంట గ్యాస్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పైన రూ2 ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచింది. ఇక చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్న వంటగ్యాస్ సిలిండర్ రేట్లను ఒక్కసారిగా పెంచింది. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 చొప్పున పెంచింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా పెంపుతో ప్రస్తుత ధర కంటే అదనంగా రూ.50 పెరగనుందని కేంద్ర పెట్రోలియం అండ్ సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తెలిపారు. గత వారంలో రెస్టారెంట్లు, హోటల్స్ సహా వివిధ కమర్షియల్ అవసరాలకు వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధర రూ.41 మేరకు తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలను బట్టి ఈ పెంపులో మార్పు ఉంటుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు