భారత్ కీలక ముందడుగు వేస్తోంది. అమెరికాతో ముందస్తు వాణిజ్యం దిశగా వెళుతోంది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ నేపథ్యంలో ఇతర దేశాల కంటే భారత్ భిన్నంగా స్పందిస్తోంది. ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి పెట్టింది. దీనిపై రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. దీనిపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయని మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబీయోతో మాట్లాడం ఆనందంగా ఉంది. ఇండో-పసిఫిక్, భారత ఉపఖండం, యూరోప్, మధ్య ప్రాచ్యం/పశ్చిమ ఆసియా మరియు కరిబియన్ ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే దానిపై ఏకాభిప్రాయానికి వచ్చాం . భవిష్యత్తులో కూడా మరిన్ని సంప్రదింపులు కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాతో ముందస్తు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం… భారత్ కీలక నిర్ణయం
By admin1 Min Read