కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు హెచ్.సి.యూకు ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేంద్ర సాధికారిక కమిటీ వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందించనుంది. టీజీఐఐసీ ఈ భూములను చదును చేపట్టిన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్, మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరు 10, 11 తేదీల్లో కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి.. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. కమిటీ రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు హెచ్.సి.యూకు కమిటీ
By admin1 Min Read