28 ఏళ్ల ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ అర్మాన్ ఆకస్మిక మరణం విమానయాన రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.బుధవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసిన అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. డిస్పాచ్ ఆఫీస్‌కు వెళ్లిన వెంటనే కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రయాణ సమయంలోనే వాంతులు చేసుకున్నట్టు, ల్యాండింగ్ అనంతరం నీరసంగా ఉన్నట్టు సిబ్బంది వెల్లడించారు. అర్మాన్ ఇటీవలే వివాహం చేసుకున్నట్టు సమాచారం.ఈ ఘటనపై ఎయిర్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటించింది. పైలట్ల పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.
Previous Articleమెగాస్టార్ ‘విశ్వంభర’ నుండి ఈనెల 12న ఫస్ట్ సింగిల్
Next Article బెంగళూరులో తాగునీటి ధరలు పెంపు…!

