లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ “గౌరవ్” ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కిలోల క్లాస్ కు చెందిన ఈ వెపన్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.వో) దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజాగా దీనిని సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుండి సైంటిస్ట్ లు టెస్ట్ చేశారు. ఈ నెల 8 నుండి 10 మధ్య ఇవి జరిగినట్లు రక్షణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టార్గెటెడ్ 100 కి.మీ రేంజ్ ను ఇది అత్యంత ఖచ్చితత్వంతో సాధించగలిగినట్లు పేర్కొంది. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేర్చేందుకు మార్గం సుగమం అయిందని తెలిపింది. ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన డీ.ఆర్‌డీ.వో ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఈ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ను డీ.ఆర్‌డీ.వోకు చెందిన ఆర్.సి.ఐ-హైదరాబాద్, పూణే లోని ఏ.ఆర్.డీ.ఈ డెవలప్ చేశాయి.
Previous Articleతెలుగు మాధుర్యాన్ని నేటితరానికి తెలియజేసేందుకు వీర్రాజు గారు ఎంచుకున్న మార్గం స్ఫూర్తిదాయకం: మంత్రి లోకేష్
Next Article విడుదలైన ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు