భారత రక్షణ రంగం మరో కీలక ముందడుగు వేసింది.30 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది.కర్నూలులో జరిగిన ఈ పరీక్షలో, డీఈడబ్ల్యూ ఎంకే–2(ఏ) అనే ఆయుధం యూఏవీలు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకొని నేలకూల్చింది.ఈ ఆయుధం 5 కి.మీ దూరంలోని లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు.విమానాలు, క్షిపణులు,డ్రోన్లను కేవలం లేజర్ కిరణాలతో ఛేదించడం ద్వారా,ఇది భవిష్యత్తు యుద్ధాలలో కీలక భూమిక పోషించనుంది.అమెరికా,చైనా,రష్యా, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచింది.కమ్యూనికేషన్ జామింగ్,శాటిలైట్ సిగ్నల్స్ నిలిపివేత వంటి ఎలక్ట్రానిక్ యుద్ధ నైపుణ్యం దీనిలో ఉంది.ఇది రోడ్డు,రైలు,సముద్రం, గగన మార్గాల్లో ప్రయోగించగలదు.పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడిన ఈ ఆయుధం,దేశం కోసం ఒక గొప్ప ఆవిష్కరణగా నిలుస్తోంది.ప్రస్తుతం దీని పునర్వికాస దశలో 20 కి.మీ దూరం వరకు ఛేదించే సూర్యా లేజర్ ఆయుధాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు