అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయం చుట్టూ రక్షణగా 4 కిమీ ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ గోడను ఇంజినీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తోందని దాని ఎత్తు, వెడల్పు , డిజైన్ వంటివి నిర్ణయించినట్లు తెలిపారు. సాయిల్ టెస్టు తర్వాత పని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో మూడో రోజు పలు కీలక విషయాలపై చర్చించారు. ప్రధానంగా ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి వంటి విషయాలు సమావేశంలో చర్చించారు. మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో అన్ని విధాలుగా పూర్తవుతుందని తెలిపారు.
రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరో 10 ఎకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ జైపూర్ నుండి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని వివరించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

