సదరన్ ఆఫ్రికా దేశం బోట్స్వానా నుండి రెండు విడతల్లో భారత్ కు చీతాలు రానున్నట్లు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. మే లో 4 చీతాలు భారత్ కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. తరువాత మరో 4 చీతాలు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. దేశంలో చిరుత ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని దానిలో 67 శాతం మధ్యప్రదేశ్ లో చిరుత పునరావాసానికే వెళ్లినట్లు తెలిపారు. ‘ప్రాజెక్ట్ చీతా’ కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి తరలించనున్నట్లు తెలిపారు. దీంతో మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ టైగర్ సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్ర ప్రాయంగా ఒప్పందం కుదిరిందన్నారు.
Previous Articleఆ రోజులు ఇంకా గుర్తున్నాయి… అలాంటిది నా పేరిట స్టాండ్ అంటే..
Next Article విశాఖ గ్రేటర్ పీఠం కూటమి కైవసం..!