అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు విచ్చేశారు. ఆయన సతీమణి ఉష భారత సంతతి మహిళ అనే విషయం విదితమే. కొద్దిసేపటి క్రితం వారు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో దిగారు. అమెరికా ఉపాధ్యక్షుడికి భారత వర్గాలు ఘనంగా స్వాగతించాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు.
అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన భారత్ లో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. నేటి నుంచి 24 వరకు ఆయన భారత్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జేడీ వాన్స్ కుటుంబం భారత్ లో పలు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించనుంది. ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని పలు చేనేత ఉత్పత్తుల దుకాణాలను సందర్శించనున్నారు. ఈరోజు సాయంత్రం వాన్స్ ప్రధాని మోడీ నివాసానికి చేరుకోనున్నారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో చర్చలు జరపనున్నారు. చర్చలు ముగిసిన అనంతరం జేడీ వాన్స్-ఉష దంపతులకు ప్రధానికి విందు ఇవ్వనున్నారు. ఈనెల 22న జైపూర్ లోని పలు చారిత్రక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనున్నారు. ఈ నెల 23న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.
కుటుంబంతో సహా భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
By admin1 Min Read